NPCIL Recruitment 2023: న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 325 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. బీఈ/బీటెక్‌ అర్హత..నో ఎగ్జాం..

|

Apr 06, 2023 | 1:18 PM

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌).. 325 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

NPCIL Recruitment 2023: న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 325 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. బీఈ/బీటెక్‌ అర్హత..నో ఎగ్జాం..
NPCIL Recruitment 2023
Follow us on

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబాయిలోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌).. 325 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వ్యాలిడ్‌ గేట్ 2021/ 2022/ 2023 స్కోరు ఉండాలి. అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 28, 2023వ తేదీ నాటికి 26 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఏప్రిల్ 28, 2023వ తేదిలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం ఏప్రిల్ 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో జనరల్ కేటగరికి చెందిన వారు రూ.500లు తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.