NIRDPR Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR)లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.?
* నోటిఫికేషలో భాగంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్, డేటా అనలిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఫైనాన్స్ అసోసియేట్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సోషల్ సైన్సెస్/ మేనేజ్‌మెంట్/ హ్యుమానిటీస్/ సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* డేటా అనలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేస్తుకునేవారు సోషల్ సైన్సెస్/ మేనేజ్‌మెంట్/ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సోషల్ సైన్సెస్/ కామర్స్/ మేనేజ్‌మెంట్/ హ్యుమానిటీస్‌లో ఎంఏ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
* ఫైనాన్స్ అసోసియేట్ పోస్టులకు కామర్స్, కంప్యూటర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 26-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Tesla Plant: టెస్లాకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన బీజేపీ పాలిత రాష్ట్రం.. పూర్తి వివరాలు
AP Corona Cases: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో వైరస్ కల్లోలం