NIPER JEE 2021 Notification: ఎన్ని రంగాల్లో ప్రత్యామ్నాయాలు వచ్చినా, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఎదురైనా ఫార్మా రంగం మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. రోజుకో కొత్త రకం వ్యాధులు మానవాళిని భయపెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే పరిశోధనలు పెరుగుతున్నాయి. వెరసి ఫార్మా రంగంలో ఉద్యోగవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా బడా సంస్థల్లో విద్యనభ్యసించిన వారి భవిష్యత్తుకు ఢోకా ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ఔత్సాహికుల కోసమే ప్రముఖ సంస్థ నైపర్ పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు నైపర్ జేఈఈ-2021 నోటిఫికేషన్ విడుదల చేసింది..
నైపర్ ఆఫర్ చేస్తున్న ఈ కోర్సుల్లో విద్యనభ్యసించాలంటే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ ఉత్తీర్ణత లేదా కొన్ని కోర్సులకు బీవీఎస్సీ, ఎంబీబీఎస్, నిర్దేశిత విభాగాల్లో ఎమ్మెస్సీ, బీటెక్ ఉత్తీర్ణులు. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం, పీహెచ్‌సీలకు 50 శాతం ఉండాలి. చివరి ఏడాది చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు జీప్యాట్ /గేట్ /నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. జీప్యాట్ స్కోర్ వ్యాలిడిటీ మూడేళ్లపాటు ఉంటుంది.
నైపర్‌లోని పీజీ కోర్సులన్నింటికి ఒకటే పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ విధానం ఉంటుంది. తప్పుడు జవాబుకు 0.25 మార్కులు కట్ చేస్తారు.
పీహెచ్‌డీకి రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. 85 మార్కులకు గాను 170 ప్రశ్నలు ఉంటాయి. కెమికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇందులోనూ నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూకి హాజరుకావాలి. దీనికి 15 మార్కులు కేటాయించారు.
* ఆన్‌లైన్ అప్లికేషన్‌కు పీజీకి మే8, పీహెచ్‌డీకి జూన్ 5 తేదీ చివరి తేదీగా నిర్వహించారు. నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు కింది వెబ్‌సైట్లను చూడండి..
వెబ్‌సైట్: http://www.niper.nic.in
వెబ్‌సైట్: http://www.niperhyd.ac.in
* దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలీ, మొహాలీలో నైపర్ క్యాంపస్‌లు ఉన్నాయి.
JEE Mains 2021: ఎన్‌టీఏ కీలక నిర్ణయం.. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..
NTPC Recruitment 2021: పరీక్ష లేకుండానే ఎన్టీపీసీలో ఉద్యోగ అవకాశాలు.. మహిళలకు మాత్రమే..