NIOS 2022 admit cards released for class 10th and 12th: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS – 2022 April) ఈ ఏడాది నిర్వహించనున్న10,12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను శనివారం (మార్చి 5) విడుదల చేసింది. సెకండరీ, సీనియర్ సెకండరీ కోర్సుల కోసం హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ sdmis.nios.ac.inను సందర్శించవచ్చు. కాగా NIOS 10, 12వ తరగతులకు ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభమై మార్చి 26 వరకు జరగనున్నాయి. ఇక ఈ తరగతులకు సంబంధించిన పబ్లిక్ (థియరీ) పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ – మే 2022 పబ్లిక్ పరీక్షలకు రుసుము చెల్లించి, ఫొటో అప్‌లోడ్ చేసిన విద్యార్ధులకు సంబంధించిన హాల్ టికెట్లు మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఒక వేళ ఎవరిదైనా ఫొటో మిస్ అయ్యి, హాల్ టికెట్ జనరేట్ కాకపోతే వెంటనే సమీపంలోని ఎన్‌ఐఓఎస్ కేంద్రాన్ని సందర్శించాలని బోర్డు సూచించింది. ఇక పరీక్షా కేంద్రంలో విద్యార్థులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్/లేదా హ్యాండ్ గ్లౌవ్స్ ధరించాలి. విద్యార్ధులు తమతోపాటు చిన్న శానిటైజర్ బాటిల్‌ను కూడా తీసుకెళ్లవచ్చు.
NIOS – 2022 April హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
Dear Learners,
Hall ticket for Practical Exams of Secondary and Senior Secondary courses for March/April 2022 exam is now available on https://t.co/4amPhWDhlZ@EduMinOfIndia @PTI_News@ANI @PIBHRD @PibLucknow @PIB_Patna @pibvijayawada @PIBBhubaneswar @PIB_Panaji @PIBAgartala pic.twitter.com/sv6yWfcF1V— NIOS (@niostwit) March 5, 2022
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చెయ్యండి.
Also Read: