నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నంలోని ఎన్‌ఐఓ ప్రాంతీయ కేంద్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
* ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 5 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను hrdg@nio.org మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ. 20,000 జీతంగా చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..