
కార్పొరేట్ కంపెనీల్లో ఉండే ఒత్తిడి గురించి తెలియంది కాదు. కఠినమైన టార్గెట్లు, డెడ్‌లైన్లు ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అక్కడి వర్క్ కల్చర్ మానసికంగా, శారీరకంగా ఉద్యోగులు నలిగిపోతుంటారు. అయితే ఢిల్లీలోని ఓ PR సంస్థ మాత్రం ఇందుకు భిన్నంగా ఉద్యోగులకు వరాల వర్షాలు కురిపిస్తుంది. ఎంబసీ గ్రూప్ పీర్ సంస్థ ఎలైట్ మార్క్ సంస్థ.. దీపావళికి ఏకంగా 9 రోజులు సెలవులు ఇస్తున్నట్లు కంపెనీ ఉద్యోగులందరికీ ఈమెయిల్ పంపించింది. ఈ ఊహించని పరిణామానికి సందరు కంపెనీ ఉద్యోగుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఆ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి ఆనందం వ్యక్తం చేస్తూ లింక్డ్‌ఇన్‌లో పోస్టు కూడా పెట్టాడు.
‘జనాలు పని ప్రదేశం, పని సంస్కృతి గురించి చాలా మాట్లాడుతారు. నిజమైన పని ప్రదేశ సంస్కృతి అనేది యజమాని తన ఉద్యోగుల అవసరాలు, శ్రేయస్సు గురించి తీసుకునే శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న శ్రామిక శక్తి సంస్థాగత విజయానికి, ఆవిష్కరణలకు పునాది అని గుర్తిస్తుంది’ అని రాసుకొచ్చారు. ఈ పోస్టుల్లో సంస్థ ఉద్యోగులు వారి కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడానికి సెలవులు ఇవ్వడాన్ని ప్రశంసించారు. సదరు సంస్థ CEO అయిన రజత్ గ్రోవర్ పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు. ఉద్యోగుల శ్రేయస్సును విలువైనదిగా భావించి, వారిని ప్రోత్సహించే సంస్థలో ఉద్యోగం చేయడం నిజమైన గౌరవం అని అన్నారు. సాధారణంగా దీపావళి గిఫ్ట్ అంటే ఉద్యోగులకు స్వీట్లు, డబ్బులు, వస్తువులు వంటివి గిఫ్టులుగా అందిస్తూ ఉంటాయి. అయితే ఈ సంస్థలు మాత్రం.. తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం వినూత్నంగా దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు ఏకంగా 9 రోజుల సెలవులను దీపావళి గిఫ్ట్‌గా అందించాయి.
సాధారణంగా ఇలాంటి అప్‌డేట్‌లను పంపే HR బృందం కూడా ఎలైట్ మార్క్ సంస్థ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపోయింది. కొత్తగా చేరిన వారి నుంచి సీనియర్ నాయకుల వరకు ప్రతి ఉద్యోగి సంతోషకరమైన దీపావళి బహుమతిగా దీనిని అందుకుంటున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.