NIMHANS Bangalore Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (Nimhans).. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ సోషల్ వర్కర్, పల్లియేటివ్ కేర్ ఏఎస్‌ఎల్‌పీ తదితర పోస్టుల (Senior Social Worker Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 6
పోస్టుల వివరాలు: సీనియర్ సోషల్ వర్కర్/ కౌన్సెలర్, పల్లియేటివ్ కేర్ ఏఎస్‌ఎల్‌పీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, పల్లియేటివ్ కేర్ నర్సు, జూనియర్ సోషల్ వర్కర్/ కౌన్సెలర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.30,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/ఎంఎస్‌డబ్ల్యూ/బీఓటీ/ఎంఓటీ/ఎంఫిల్/పీహెచ్‌డీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 26, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.