NIEPMD Lecturer Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికరత మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్ (NIEPMD).. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్, ఫిజియోథెరపిస్ట్ పోస్టుల (Physiotherapist posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: లెక్చరర్ పోస్టులు – 5, ఫిజియోథెరపిస్ట్ పోస్టులు – 1
పే స్కేల్: నెలకు 30,000ల నుంచి 39,600ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఫిజియోథెరపీలో మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజర్వాల్సి ఉంటుంది.
అడ్రస్: NIEPMD, East Coast Road, Muttukadu, Chennai-603 112.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: