IIT: ఐఐటీలో చదవడం మీ డ్రీమా.? అయితే మీకు గుడ్‌ న్యూస్‌..

|

Apr 14, 2024 | 5:21 PM

వచ్చే ఏడాది నుంచి ఐఐటీల్లో పలు కోర్సులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 2024-25 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు తీసుకొస్తున్నారు, దీంతో సీట్ల సంఖ్య పెరగనుంది. ఈ కారణంతో కొత్తగా ఏకంగా 4 వేల వరకు సీట్లు పెరగనున్నాయి. దేశంలోని పలు ఐఐటీల్లో కొత్త కోర్సులను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఐఐటీ బాంబేలో క్వాంటం సైన్స్ అండ్‌ టెక్నాలజీ...

IIT: ఐఐటీలో చదవడం మీ డ్రీమా.? అయితే మీకు గుడ్‌ న్యూస్‌..
IIT
Follow us on

ఐఐటీల్లో చదవాలనేది చాలా మంది కల. దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీల్లో సీటు సంపాదించుకోవడం ప్రతీ ఒక్క విద్యార్థి ఆశిస్తుంటారు. అయితే వీటిలో సీటు సంపాదించుకోవడం అంత తేలికైన విషయం కాదు. సీట్లు తక్కువగా ఉండడం పోటీ ఎక్కువ ఉండడంతో కేవతం కొందరు మాత్రమే ఈ అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. అయితే తాజాగా అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం ఐఐటీల్లో చదువుకోవాలనుకునే వారికి శుభవార్తగా చెప్పొచ్చు.

వచ్చే ఏడాది నుంచి ఐఐటీల్లో పలు కోర్సులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 2024-25 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు తీసుకొస్తున్నారు, దీంతో సీట్ల సంఖ్య పెరగనుంది. ఈ కారణంతో కొత్తగా ఏకంగా 4 వేల వరకు సీట్లు పెరగనున్నాయి. దేశంలోని పలు ఐఐటీల్లో కొత్త కోర్సులను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఐఐటీ బాంబేలో క్వాంటం సైన్స్ అండ్‌ టెక్నాలజీ, ఐఐటీ మద్రాస్‌లో ఈ మెబిలిటీ, మెడికల్‌ ఇంజినీరింగ్‌, సస్టెబిలిటీ, వాటర్‌ సెక్యూరిటీ అండ్‌ గ్లోబల్‌ చేంజ్‌, ఐఐటీ తిరుపతిలో ఇంజినీరింగ్ ఫిజిక్స్‌ (బీటెక్‌ డిగ్రీ), ఐఐటీ హైదరాబాద్‌లో డిసిప్లినరీ పీహెచ్‌డీ కోర్సుల్లో కొలాబరేటివ్‌ రీసెర్చ్‌ కోర్సులను తీసుకొస్తున్నారు.

తిరుపతి ఐఐటీలో తీసుకొస్తున్న ఇంజినీరింగ్ ఫిజిక్స్‌ను 10 సీట్లతో తీసుకొస్తున్నారు. డిమాండ్‌ ఆధారంగా సీట్లను పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాటర్‌ సెక్యూరిటీ అండ్‌ గ్లోబల్‌ చేంజ్‌ కోర్సునూ జాయింట్‌ మాస్టర్స్‌ ప్రోగామ్‌గా ప్రారంభించనున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఇంటర్‌ డిసిప్లినరీ పీహెచ్‌డీ కోర్సుల్లో కొలాబరేటివ్‌ రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంట్లో భాగంగా కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం విద్యార్థులు ఎలక్ట్రానిక్స్‌ విభాగం వారితో కలిసి రీసెర్చ్‌ చేస్తారు.

ఇదిలా ఉంటే కొత్తగా తీసుకొస్తున్న ఈ కోర్సుల ద్వారా కటాఫ్‌ మార్కులు తగ్గనున్నాయి. ఐఐటీల్లో ఇప్పటి వరకు మొత్తం 17,385 సీట్లు ఉన్నాయి. మరో 7,456 సీట్లు ఎన్‌ఐటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఖరగ్‌పూర్‌లో 1,869, వారణాసిలో 1,589, బాంబేలో 1,356, రూర్కీలో 1,353, హైదరాబాద్‌లో 595 సీట్లు ఉన్నాయి. కొత్తగా తీసుకొస్తున్న సీట్ల కారణంగా కటాఫ్‌ స్కోర్‌ తగ్గడంతో ఎక్కువ మంది సీట్లు పొందే అవకాశం లభిస్తుంది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..