Fact Check: ఆ వార్తలు నమ్మొద్దు! నీట్‌ యూజీ 2022 పరీక్ష యథాతథం.. ఫేక్‌ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చిన పీఐబీ

|

Jun 22, 2022 | 9:40 AM

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (NEET UG 2022) అండర్‌ గ్రాడ్యుయేట్‌-2022 పరీక్ష వాయిదా వేశారంటూ నెట్టింట ఫేక్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. జులై 17కి బదులు నవంబర్‌ 4న పరీక్ష జరుగుతుందనీ..

Fact Check: ఆ వార్తలు నమ్మొద్దు! నీట్‌ యూజీ 2022 పరీక్ష యథాతథం.. ఫేక్‌ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చిన పీఐబీ
Neet Ug 2022
Follow us on

NEET UG 2022 Exam not postponed: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (NEET UG 2022) అండర్‌ గ్రాడ్యుయేట్‌-2022 పరీక్ష వాయిదా వేశారంటూ నెట్టింట ఫేక్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. జులై 17కి బదులు నవంబర్‌ 4న పరీక్ష జరుగుతుందనేది ఫేక్‌ న్యూస్ సారాంశం. దీనిపై స్పంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ విధంగా వివరణ ఇచ్చింది. ‘నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించిన యూజీ 2022 పరీక్ష తేదీ జులై 17కు బదులు సెప్టెంబర్‌ 4న జరుగుతుందనే జస్టీస్‌ ఫర్‌ నీట్‌ యూజీ, డిఫర్‌ నీట్‌ యూజీ అనే హ్యాష్‌ ట్యాగ్‌లతో ఫేక్‌ న్యూస్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఎన్టీఏ నీట్‌ యూజీ పరీక్షను వాయిదా వేయలేదు. అది నకిళీ వార్త. త్వరలో నీట్ యూజీ 2022 అడ్మిట్‌ కార్డులను విడుదల చేస్తామని, అడ్మిట్‌ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌ ntaneet.nic.inలో అందుబాటులో ఉంటాయని’ స్పష్టం చేస్తూ ట్వీట్‌ చేసింది.

కాగా ఈ ఏడాది నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష కోసం దాదాపు 8 లక్షల మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 10.64 లక్షల మంది మహిళా అభ్యర్ధులు కావడం గమనార్హం. 8.07 మంది పురుష అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా మొత్తం 18.72 లక్షలకు పైగా అభ్యర్థులు నీట్‌ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జులై 17న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 భాషల్లో ఎన్టీఏ నీట్‌ పరీక్షను నిర్వహించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.