NEET PG 2022: గుడ్‌న్యూస్! నీట్ పీజీ 2022 మే 21కి వాయిదా.. కొత్త షెడ్యూల్ విడుదల చేసిన మెడికల్ బోర్డు!

|

Feb 05, 2022 | 9:29 AM

నీట్ పీజీ (NEET PG 2022) దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ శుక్రవారం (ఫిబ్రవరి 4) ప్రకటించింది. పరీక్ష తేదీని కూడా మార్చుతూ..

NEET PG 2022: గుడ్‌న్యూస్! నీట్ పీజీ 2022 మే 21కి వాయిదా.. కొత్త షెడ్యూల్ విడుదల చేసిన మెడికల్ బోర్డు!
Supreme Court
Follow us on

NEET PG 2022 Revised Schedule: నీట్ పీజీ (NEET PG 2022) దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ శుక్రవారం (ఫిబ్రవరి 4) ప్రకటించింది. పరీక్ష తేదీని కూడా మార్చుతూ కొత్త హెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 4తో ముగియనుండగా మార్చి 25 (రాత్రి 11:55 గంటల)వరకు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మే 16న విడుదలవ్వనున్నాయి. ఇక మార్చి 12, 2022న జరగాల్సిన నీట్ పీజీ 2022 పరీక్ష, కొత్త షెడ్యూల్ ప్రకారం మే 21, 2022న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య నిర్వహించబడుతుందని ఎన్‌బీఈఎమ్‌ఎస్ (NBEMS) అధికారిక ప్రకటన తెల్పుతోంది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షను వాయిదా వేయవల్సిందిగా మెడికల్ విద్యార్ధులు అధికారులను అభ్యర్థించడంతో, నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ నోటిఫికేషన్ వెలువడింది. కొత్త షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు, పరీక్షతేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే అప్లికేషన్ ఎడిట్ విండో మార్చి 29 నుండి ఏప్రిల్ 7, 2022 వరకు తెరవబడుతుంది. ఇక ఫైనల్ ఎడిట్ విండో ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 30 మధ్య తెరవబడుతుంది.
అడ్మిట్ కార్డ్‌లు మే 16న విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారైంది. నీట్ పీజీ 2022 ఫలితాలు జూన్ 20, 2022 నాటికి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలియజేసింది.

కాగా చాలా మంది ఎంబీబీఎస్ అభ్యర్థులు గత ఏడాది కోవిడ్ విధుల్లో బిజీగా ఉన్నందున తమ ఇంటర్న్‌షిప్‌లను పూర్తి చేయలేకపోయామని, ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యేంతవరకు పరీక్షను వాయిదా వేయవల్సిందిగా కోరారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, అధికారులు పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. నీట్ పీజీ పరీక్షకు హాజర్యే అభ్యర్థులు తప్పనిసరి ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాలనే నిబంధన ఉంది. పై కారణాత రిత్యా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నీట్ పీజీ 2022ను 6-8 వారాలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తాజా ప్రకటన పేర్కొంది.

Also Read:

ESIC Jobs 2022: ఇఎస్ఐలో రాత పరీక్షలేని మెడికల్ జాబ్స్! ఏఏ విభాగాల్లో ఖాళీలున్నాయంటే..