లెక్కలు అంటేనే చాలా మంది భయపడుతుంటారు. మ్యాథ్స్ క్లాస్ అంటేనే హర్రర్‌గా ఫీలయ్యే స్టూడెంట్స్ ఎంతో మంది ఉంటారు. అయితే గణితాన్ని ఇష్టపడితే దానంత సులువైంది, ఛాలెంజింగ్ సబ్జెక్ట్ మరొకటి ఉండదని నిపుణులు చెబుతున్నారు. కష్టంగా భావించే గణితాన్ని సులభంగా బోధిస్తూ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు తెలుగు కుర్రాడు నీలకంఠ భాను. ఆధునిక పద్ధతుల్లో మ్యాథ్స్‌ను నేర్పించేందుకు భాను.. భాన్జు అనే ఓ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ స్టార్టప్‌కు భారీగా ఫండింగ్ లభించడ విశేషం.
శకుంతలా దేవి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన ప్రపంచ అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్ – నీలకంఠ భాను.. భాన్జు పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారడు. విద్యార్థులకు సులభమైన పద్ధతుల్లో గణితంలో మెలుకువలు నేర్పడించడమే ఈ స్టార్టప్ ముఖ్య ఉద్దేశం. అయితే కేవలం కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం చేయకుండా ఈ సంస్థను అమెరియా, యూకేతో పాటు మిడిల్ ఈస్ట్ మార్కెట్‌లోకి కూడా విస్తరించేందుకు భాను ప్రణాళికలు రచిస్తున్నాడు.
ఇందులో భాగంగానే ఈ గ్లోబల్ మ్యాథ్-లెర్నింగ్ ఎడ్యు-టెక్ స్టార్టప్.. ఎపిక్ క్యాపిటల్ నేతృత్వంలోని జెడ్ 3 వెంచర్స్, యైట్ రోడ్స్, లైట్‌స్పీడ్ వెంచర్స్ నుండి నిరంతర మద్దతుతో సిరీస్- బి ఫండింగ్ రౌండ్‌లో $16.5 మిలియన్లను సేకరించింది. మన కరెన్సీలో చెప్పాలంటో సుమారు రూ. 140 కోట్లు. రాబోయే ఐదేళ్లలో 100 మిలియన్ల విద్యార్థులకు చేరువకావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. భాన్జు సబ్‌స్క్రిప్షన్లు కూడా ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి.
నిజ జీవితాన్ని కనెక్ట్ చేస్తూ గణితాన్ని నేర్పించే విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. , విద్యార్థులు గణితాన్ని కేవలం అకాడమిక్స్ మాత్రమే పరిమితం కాకుండా రోజువారీ సమస్యల పరిష్కారానికి ఉపయోగించేలా రూపొందించారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం ఉపయోగిస్తున్నారు. ఇక నీలకంఠ భాను.. లండన్‌లో 2020లో జరిగి మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్‌లో మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టంచాడు. గణితంపై తనకున్న అభిరుచితో, భాను గణితాన్ని ఆనందదాయకంగా, అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాడు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..