భారత ప్రభుత్వ కార్పొరేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. మూడేళ్ల ఒప్పంద ప్రాతిపదికన 52 డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, యంగ్‌ప్రొఫెషనల్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ట్యాక్సేషన్, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, మార్కెటింగ్, మీడియా కమ్యునికేషన్, అగ్రి ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎంకాం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 32 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 31, 2022వ తేదీలోపు కింది ఈ మెయిల్ ఐడీకి దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
ఈమెయిల్ ఐడీ: careers@ncdc.in
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.