Jawahar Navodaya Vidyalaya Admissions 2023-24: న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న జవహర్ నవోదయా విద్యాలయ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా స్కూళ్లలో ఏర్పడిన ఖాళీల ఆధారంగా ఈ ప్రవేశాలు జరుగుతాయి. ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు మే 1, 2008 నుంచి ఏప్రిల్ 30, 2010వ తేదీల మధ్య జన్మించి ఉండాలి. 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైన ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ అర్హతలున్న విద్యార్ధులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 15, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మ్యాథమెటిక్స్, జనలర్ సైన్స్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టు్ల్లో రెండున్నర గంటల సమయంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11, 2023వ (ఆదివారం) తేదీన దేశ వ్యాప్తంగా రాత పరీక్ష నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.