National Book Trust Jobs 2022: డిగ్రీ అర్హతతో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. నెలకు రూ.45,000ల జీతం..

|

Dec 14, 2022 | 8:02 AM

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌.. ఒప్పంద ప్రాతిపదికన 12 ఈవెంట్‌ మేనేజర్‌, ప్రొటోకాల్‌ ఆఫీసర్‌, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌, ఆర్‌ఆర్‌/మీడియా ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి..

National Book Trust Jobs 2022: డిగ్రీ అర్హతతో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. నెలకు రూ.45,000ల జీతం..
National Book Trust of India
Follow us on

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌.. ఒప్పంద ప్రాతిపదికన 12 ఈవెంట్‌ మేనేజర్‌, ప్రొటోకాల్‌ ఆఫీసర్‌, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌, ఆర్‌ఆర్‌/మీడియా ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తోపాటు సంబంధిత పనిలో కనీసం ఏడాది నుంచి మూడేళ్ల పాటు అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని డిసెంబర్‌ 16, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిముషాల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.35,000ల నుంచి రూ.45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

National Book Trust, India Nehru Bhawan, 5, Institutional Area, Phase-ll, Vasant Kunj, New Delhi-110070.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.