NATA 2022: నేటితో ముగియనున్న నాటా 2022 ఫేజ్‌ 1 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు..

|

May 24, 2022 | 8:12 AM

నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (NATA 2022) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటి (మే 23)తో ముగుస్తుంది. చివరి నిముషం వరకు ఎదురు చూడకుండా..

NATA 2022: నేటితో ముగియనున్న నాటా 2022 ఫేజ్‌ 1 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు..
Nata 2022
Follow us on

NATA 2022 Registration last date: నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (NATA 2022) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటి (మే 23)తో ముగుస్తుంది. చివరి నిముషం వరకు ఎదురు చూడకుండా అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఈ సదర్భంగా సూచించింది. కాగా దేశంలోని పలు ఆర్కిటెక్చరల్ ఇన్‌స్టిట్యూషన్లలో ఐదేళ్ల బ్యాచిలర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ డిగ్రీ (BArch) కోర్సుల్లో నాటా ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పించడానికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) ప్రతీ ఏట ఈ పరీక్షను నిర్వహిస్తోంది. 2022 – 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి కౌన్సిల్‌ మూడు సార్లు నాటా పరీక్షను నిర్వహిస్తోంది. నాటా ఫేజ్ 1 పరీక్ష జూన్ 12న నిర్వహించనున్నారు. నాటా ఫేజ్‌ 2 పరీక్ష జూలై 3 తేదీన, ఫేజ్‌ 3 పరీక్షల జూలై 24న జరుగుతాయి. ఈ పరీక్షలు రెండు షిఫ్టుల్లో నిర్వహించబడతాయి. మొదటి షిఫ్టు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిముషాల వరకు పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ nata.inను చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.