NABARD: పీజీ విద్యార్థులకు నాబార్డ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. నెలకు రూ.18,000 స్టైపెండ్.. చివరి తేది ఎప్పుడంటే..

|

Mar 01, 2021 | 6:16 PM

Nabard Student Internship Program: మీరు పీజీ చదువుతున్నారా.? ప్రభుత్వ రంగ సంస్థలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ చేస్తూనే స్టైపెండ్ పొందాలనుకుంటున్నారా అయితే ఈ వార్త మీకోసమే...

NABARD: పీజీ విద్యార్థులకు నాబార్డ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. నెలకు రూ.18,000 స్టైపెండ్.. చివరి తేది ఎప్పుడంటే..
Follow us on

Nabard Student Internship Program: మీరు పీజీ చదువుతున్నారా.? ప్రభుత్వ రంగ సంస్థలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ చేస్తూనే స్టైపెండ్ పొందాలనుకుంటున్నారా అయితే ఈ వార్త మీకోసమే. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) పీజీ విద్యార్థుల కోసం ఓ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
కేవలం రెండు నెలలకు మాత్రమే పరిమితమైన ఈ ఇంటర్న్‌షిప్ కోసం మొత్తం 75 ఖాళీలను ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నవారు ఎవరైనా ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎంపిక అయిన వారికి నెలకు రూ.18,000 స్టైపెండ్‌గా అందిస్తారు.
ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nabard.org/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ దరఖాస్తులకు మార్చి 5ను చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారు 2021 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న వారై ఉండాలి. అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, అగ్రి బిజినెస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండాలి. వీరితో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఇక ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులు.. కొన్ని షార్ట్ టర్మ్ టాస్కులు పూర్తి చేయాల్సి ఉంటుంది. రూరల్ మార్కెట్లు, హోమ్‌స్టే, రూరల్ టూరిజం, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, మైక్రో ఏటీఎం, ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ లాంటి అంశాలపైన అభ్యర్థులు ప్రాజెక్ట్స్ రూపొందించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (NEST) 2021 నోటిఫికేషన్‌ కూడా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటేడ్ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశాలు పొందొచ్చు. ఈ సంస్థల్లో సీటు సంపాదించిన విద్యార్థులకు దిశ ప్రోగ్రామ్‌ కింద ఐదేళ్లపాటు ఏడాదికి రూ.60,000 చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. అలాగే సమ్మర్‌ ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 అదనంగా ఇస్తారు. ఫిబ్రవరి 24 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 30న ముగియనుంది. పూర్తి వివరాలకు https://www.nestexam.in/ లో చూడొచ్చు.

Also Read: IGNOU January 2021: అభ్యర్థులకు ముఖ్య గమనిక.. దరఖాస్తు గడువును పెంచిన ఇగ్నో.. చివరితేదీ ఎప్పుడంటే…

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

Summer Stroke: ఈసారి మాడు పగలడం ఖాయం.. దంచికొట్టనున్న ఎండలు.. ముందుముందు మరీ తీవ్రం