నాబార్డ్ (NABARD) డెవలప్‌మెంట్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ – 2022 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల కోసం నియామక ప్రకటనను జారీ చేసింది. 177 ఖాళీలను భర్తీ చేస్తుందని అంచనా వేసింది. నాబార్డ్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడతాయి. అభ్యర్థులు నోటిఫికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – 15 సెప్టెంబర్ 2022 కాగా.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ -10 అక్టోబర్ 2022. పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) – అభ్యర్థి కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి తప్పనిసరి లేదా ఎంపిక సబ్జెక్ట్‌గా హిందీ లేదా ఇంగ్లీషులో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్రధాన సబ్జెక్ట్‌గా హిందీ లేదా ఇంగ్లీషులో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 32,000 భృతిగా ఇవ్వనున్నారు. వయసు పరిమితి 21 నుంచి 35 సంవత్సరాలుగా నిర్ణయించింది. దరఖాస్తు రుసుము OBC, EWS రూ.450గా, SC, ST, PWD, EWS, Ex-Servicemen రూ. 50 గా నిర్ణయించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..