న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని పలు ఎయిమ్స్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 3055 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో మంగళగిరిలో 117 ఖాళీలు ఉన్నాయి.? ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* మంగళగిరి ఎయిమ్స్‌లో మొత్తం 117 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులను నార్‌సెట్-4 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 05-05-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పరీక్షను 03-06-2023 తేదీన నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..