
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS).. సంయుక్తంగా దేశవ్యాప్తంగా భారీగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం దాదాపు 15,101 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నియామక ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 1,288 కేవీ పాఠశాలలు, 653 జవహర్ నవోదయాలు ఉన్నాయి. నిర్వహిస్తున్నాయి. ఇందులో ఎంపికై వారిని దేశంలో ఎక్కడైనా గ్రామీణ, పట్టణ, రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో పని చేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును బట్టి.. 10వ తరగతి/ 12వ తరగతి/ గ్రాడ్యుయేషన్/ 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, B.Ed/ ఇంటిగ్రేటెడ్ B.Ed, M.Edలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి ఆయా పోస్టులను బట్టి 35 నుంచి 50 సంవత్సరాల వరకు ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. టీచింగ్ పోస్టుల (PRT & TGT పోస్టులు)కు CTET లో అర్హత సాధించి ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం, రాత పరీక్ష తేదీలు, సిలబస్ వంటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు KVS/NVS/CBSE వెబ్‌సైట్‌లలో త్వరలో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు అధికారిక పోర్టళ్లను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి.
ఇతర వివరాలకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.