కర్ణాటక బ్యాంకు లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ కేబీఎల్ శాఖల్లో.. ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎంబీఏ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు డిసెంబర్ 1, 2022వ తేదీ నాటికి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. అంటే డిసెంబర్ 2, 1994కి ముందు జన్మించినవారు అర్హులు.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులకు రూ.800, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.700లు రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.84,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం 225 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. 200ల మార్కులకు 200ల మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. 25 మార్కులకు 30 నిముషాల్లో డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.