Jobs In Deccan Fine Chemicals: ఆంధ్రప్రదేశ్‌లోని డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ప్రొడక్షన్ విభాగంలో 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్చి 6న జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు.
ప్రొడక్షన్ విభాగంలో ఉన్న ఖాళీల కోసం డిగ్రీ (బీ.ఎస్‌సీ కెమిస్ట్రీ) చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకుగాను 2016-2020 మధ్య డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఇక ఈ ఉగ్యానికి ఎంపికైన వారికి నెలకు రూ. 18,660 వరకు వేతనం చెల్లించనున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
మార్చి 6న జరగనున్న ఈ ఇంటర్వ్యూను కాకినాడలోని రమణయ్యపేటలో ఉన్న’రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెనెజ్‌మెంట్ అండ్ సైన్స్’లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు అభ్యర్థులు కాలేజీకి రావాలని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో రెజ్యూమేతో పాటు, స్టడీ సర్టిఫికేట్లు (జిరాక్స్)లు తెచ్చుకుంటే మంచిది. ఇక సందేహాలు, సలహాల కోసం.. 9010737998 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
@AP_Skill Collaborated with Deccan Fine Chemicals (India) Pvt Ltd, to Conduct #ICSTP Program.
Registration Link: https://t.co/K2eBuec4MY
Contact: Mr.Siva Rama Krishna – 9010737998
Mr.Perumallarao – 7386706272
APSSDC Helpline 1800 425 2422 pic.twitter.com/x4HTvhJMqD— AP Skill Development (@AP_Skill) March 4, 2021