JNVST 2022: జవహర్ నవోదయ విద్యాలయాలలో (JNV) 6వ తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ 30, 2022న ప్రవేశ పరీక్ష జరుగనుంది. దీని పేరు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST). నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్ 2022-23 కోసం దరఖాస్తు చేయడానికి ఈ రోజే (15.12.2021) చివరి తేదీ. మీరు మీ పిల్లలను NVS 6వ తరగతిలో చేర్చాలంటే ఇప్పుడే అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inకి వెళ్లి అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి. ఇప్పటికే చివరితేది ఒకసారి పొడిగించారు. మీరు ఈ రోజు సాయంత్రం వరకు ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించవచ్చు.
NVS 6వ తరగతి
ఈ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశాలకు మే 01 2009, ఏప్రిల్ 30 2013లోపు జన్మించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతుండడం తప్పనిసరి. NVS దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా తప్పుగా నింపితే సరిదిద్దడానికి మీకు ఇంకా అవకాశం ఉంది. NVS దీని కోసం డిసెంబర్16,17 తేదీలను నిర్ణయించింది. మీరు సమర్పించిన ఫారమ్‌లో ఏదైనా పొరపాటు ఉంటే డిసెంబర్ 17, 2021 వరకు సరిదిద్దుకోవచ్చు. అధికారిక నోటీసు ప్రకారం మీరు మీ జెండర్, కేటగిరీ (జనరల్, OBC, SC, ST), ప్రాంతం (గ్రామీణ లేదా పట్టణ), వైకల్యం, పరీక్షా మాధ్యమం (భాష) మొదలైన వాటని మార్చుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి..?
navodaya.gov.inలో NVS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోమ్ పేజీలో, నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్ లింక్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, పేరు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీని సమర్పించండి. రిజిస్ట్రేషన్ ID రూపొందించిన తర్వాత, వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వండి. ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని నింపండి. దరఖాస్తు రుసుమును చెల్లించండి. దరఖాస్తును సమర్పించిన తర్వాత ప్రింట్ తీసుకోండి.