JNUEE Result 2021: త్వరలో జేఎన్‌యూ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్.. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

|

Oct 22, 2021 | 5:43 AM

JNUEE Result 2021: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ త్వరలోనే విడుదల కానున్నాయి.

JNUEE Result 2021: త్వరలో జేఎన్‌యూ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్.. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..
Jnu
Follow us on

JNUEE Result 2021: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి నిర్వహించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ త్వరలోనే విడుదల కానున్నాయి. JNUEE 2021 ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెప్టెంబర్ 20, 21, 22, 23 తేదీలలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ jnuexams.nta.ac.in ని సందర్శించడం ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే తాత్కాలిక ఆన్సర్ కీ ని యూనివర్సిటీ విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో తుది ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో యూజీ, పీజీ, డాక్టోరల్ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి యూనివర్సిటీలో సీటు కేటాయించడం జరుగుతుంది.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్- jnuexams.nta.ac.in కి వెళ్లాలి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షకు వెళ్లాలి.
3. ఇప్పుడు ‘JNUEE Result 2021’ లింక్‌పై క్లిక్ చేయాలి.
4. అప్లికేషన్ నంబర్, సెక్యూరిటీ పిన్ నమోదు చేయాలి.
5. రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
6. అభ్యర్థులు తమ ఫలితాల కాపీని తప్పనిసరిగా ప్రింట్ తీసుకోవాలి.

సమస్యల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్ నంబర్..
విద్యార్థులు ఏవైనా సమస్యలున్నా, మార్పుల కోసం JNU, NTA వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. అభ్యర్థులు NTA హెల్ప్ డెస్క్‌ నెంబర్‌ 011-40759000 ని సంప్రదించవచ్చు. లేదా jnu@nta.ac.in లో NTA కి కంప్లైంట్ ఇవ్వవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు అభ్యర్థులను చేర్చుకోవడానికి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రతీ ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. అభ్యర్థులను సీబీటీ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే, పీహెచ్‌డీకి సెలక్షన్ మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. 70 శాంతి సీబీటీ టెస్ట్ మార్కులు, 30 శాతం ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా సీటు కేటాయించడం జరుగుతుంది.

Also read:

Turmeric Water Benefits: పసుపు నీరు రోజూ తాగుతున్నారా?.. అయితే ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు..!

TDP vs YCP: పట్టాభిని అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొన్న పోలీసులు..

Telangana: ఛీ.. వీడసలు మనిషేనా?.. తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలను ఆదుకుంటానని చెప్పి..