JEE Main 2026: జేఈఈ మెయిన్‌లో టాప్‌ స్కోర్‌ తెచ్చిపెట్టే టాపిక్స్‌ ఇవే.. అస్సలు మిస్‌ కావొద్దు!

JEE Main 2026 Scoring Topics: మరో నెల రోజుల్లో జేఈఈ మెయిన్ జనవరి సెషన్ 2026 పరీక్షలు మొదలుకానున్నాయి. ఇప్పటికే విద్యార్ధుల ప్రిపరేషన్ చివరి దశకు చేరుకుని ఉంటుంది. అయితే అత్యంత కఠినమైన జేఈఈ మెయిన్ లో టాప్ స్కోర్ సాధించాలంటే సిలబస్ లో కొన్ని టాపిక్స్ పై పట్టు సాధించాలని..

JEE Main 2026: జేఈఈ మెయిన్‌లో టాప్‌ స్కోర్‌ తెచ్చిపెట్టే టాపిక్స్‌ ఇవే.. అస్సలు మిస్‌ కావొద్దు!
JEE Main 2026 scoring topics

Updated on: Dec 27, 2025 | 4:22 PM

జేఈఈ మెయిన్ జనవరి సెషన్ 2026 పరీక్షలు సమీపిస్తున్నాయి. అడ్మిట్‌ కార్డులు కూడా త్వరలోనే విడుదలకానున్నాయి. ఇక జేఈఈ మెయిన్ పరీక్షలు జనవరి 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. జేఈఈ మెయిన్ 2026 ప్రిపరేషన్‌కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో అభ్యర్థులు తమ సన్నాహాలు చివరి దశలో ఉంటుంది. అయితే జేఈఈ మెయిన్‌లో స్కోర్ పెంచుకునేందుకు, పరిపూర్ణ సెంట్ పర్సంటైల్ సాధించడానికి శిక్షా నేషన్ CEO సౌరభ్ కుమార్ అత్యధిక స్కోరింగ్ పొందేందుకు కొన్ని టిప్స్‌ చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జేఈఈ మెయిన్ 2026లో అత్యధిక స్కోరింగ్ పొందేందుకు సహకరించే టాపిక్స్‌ ఇవే..

ఫిజిక్స్‌ నుంచి వచ్చే కీలక చాపర్లు ఇవే

Current Electricity

జేఈఈ మెయిన్‌లో అత్యధిక స్కోర్ పొందేందుకు సహకరించే టాపిక్స్‌లో ఇది ఒకటి. డైరెక్ట్‌ ప్రశ్నలు అడిగే ఛాన్స్‌ ఇందులో ఎక్కువ. అలాగే రిపీట్‌ క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్‌లో వస్తుంటాయి. ఫార్ములాలు, కాన్సెప్టుల్లో పట్టు ఉంటే ఇందులో ఫుల్‌ మార్కులు సాధించవచ్చు.

ఎలక్ట్రోస్టాటిక్స్ & కెపాసిటర్లు

ఈ చాప్టర్లు 12వ తరగతి ఫిజిక్స్‌కి వెన్నెముక వంటివి. వీటి నుంచి ప్రశ్నలు క్రమం తప్పకుండా అడుగుతారు. ఫార్ములాలు, స్టాండర్డ్‌ రిజల్ట్స్‌ ఖచ్చితంగా నేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

మోడ్రన్‌ ఫిజిక్స్

ఈ చాప్టర్‌ని అస్సలు మిస్‌ కావద్దు. అణు నిర్మాణం, అణు భౌతిక శాస్త్రం, కాంతివిద్యుత్ ప్రభావం, సెమీకండక్టర్లకు సంబంధించిన ఫార్ములా బేస్డ్‌ మల్టిపుల్‌ క్వశ్చన్లు ఇందులో నుంచి అడుగుతారు.

ఆప్టిక్స్ (Ray + Wave)

ఆప్టిక్స్ ప్రశ్నలు దృశ్యమానంగా, నిర్మాణాత్మకంగా ఉంటాయి. ప్రామాణిక సంఖ్యాశాస్త్రం, రేఖాచిత్రాలను అభ్యసించే విద్యార్థులు ఈ విభాగం నుంచి అత్యధికంగా స్కోరింగ్ చేస్తుంటారు.

చలన నియమాలు, వర్క్‌-ఎనర్జీ-పవర్ (Laws of Motion & Work-Energy-Power)

ఇవి ఫండమెంటల్‌ చాప్టర్లు. అవి సరళంగా కనిపించవచ్చు. కానీ అవి ప్రశ్నపత్రంలో తరచూ కనిపిస్తాయి. పరీక్ష ప్రారంభంలోనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.

కెమిస్ట్రీ నుంచి అడిగే కీలక చాప్టర్లు

ఫిజికల్ కెమిస్ట్రీ (మోల్ కాన్సెప్ట్)

కెమిస్ట్రీలో ప్రశ్నలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఈ చాప్టర్‌పై పట్టు సాధిస్తే ఫిజికల్ కెమిస్ట్రీలో సగం సిలబస్‌ పూర్తయినట్లే.

రసాయన గతిశాస్త్రం, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ (Chemical Kinetics, Thermodynamics & Electrochemistry)

ఈ చాప్టర్‌లు ఫిక్స్‌డ్‌ ఫార్ములాలు, ప్రశ్నా విధానాలను అనుసరిస్తాయి. సంఖ్యాశాస్త్రాన్ని చదివే విద్యార్థులు ఈ చాప్ట్‌ర్‌ను అత్యధిక స్కోర్‌ సాధించే విభాగంగా పరిగణిస్తారు.

ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ (Inorganic Chemistry)

కోఆర్డినేషన్‌ కాంపౌండ్స్ (Coordination Compounds)

ఈ చాప్టర్‌ నుంచి ప్రతీ యేటా ప్రశ్నలు వస్తుంటాయి. బట్టీ పట్టడం కంటే లాజిక్‌గా ఇందులో పట్టు సాధించవచ్చు.

పీరియాడిక్‌ టేబుల్, కెమికల్‌ బాండింగ్‌ (Periodic Table & Chemical Bonding)

ఈ విభాగంలో కాన్సెప్టులపై క్లారిటీ వస్తే పలు చాప్టర్లలో మీ పర్ఫామెన్స్‌ను మెరుగుపరుస్తుంది.

p-బ్లాక్ & d-బ్లాక్ టాపిక్స్‌

ఆ టాపిక్స్‌ నుంచి చాలా ప్రశ్నలు NCERT లైన్ల నుంచి డైరెక్ట్‌ మెథడ్‌లో అడుగుతారు. దీనిపై పట్టు సాధించడానికి ఎలాంటి షార్ట్‌కర్ట్స్‌ లేవు. చచ్చినట్లు టెక్ట్స్‌ బుక్స్‌ చదవాల్సిందే.

ఆర్గానిక్ కెమిస్ట్రీ

జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ (GOC)

ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి పునాది. GOC బలంగా ఉంటే, ప్రతిచర్యలు యాదృచ్ఛికంగా రావడానికి బదులు అర్థవంతంగా మారడం ప్రారంభిస్తాయి.

హైడ్రోకార్బన్లు

అధిక స్కోర్ సాధించడానికి దోహపదడే చాప్టర్ ఇది. పరీక్షలో తప్పకుండా ప్రశ్నలు అడిగే కాంపాక్ట్ అధ్యాయం ఇది.

మ్యాథమెటిక్స్‌

మాత్రికలు & నిర్ణాయకాలు (Matrices & Determinants)

ఈ చాప్టర్ల నుంచి ప్రతీ యేటా కనీసం రెండు డైరెక్ట్ ప్రశ్నలు ఇందులో నుంచి వస్తాయి. ఇవి ఫార్ములా ఆధారితమైనవి. అధిక స్కోరింగ్ తెచ్చుకునేందుకు ఇది కూడా దోహదపడుతుంది.

వెక్టర్ ఆల్జీబ్రా & 3D జ్యామితి (Vector Algebra & 3D Geometry)

డయాగ్రామ్స్‌పై భయాన్ని అధిగమించిన విద్యార్ధులకు ఇది చాలా సులభమైన స్కోరింగ్ సాధించే టాపిక్‌.

కోఆర్డినేట్ జ్యామితి (Straight Line, Circle, Parabola)

ఈ చాప్టర్ల నుంచి ప్రశ్నలు యేటా రిపీట్‌ అవుతుంటాయి. PYQ ప్రాక్టీస్ చాలా కీలకం.

స్టాటిస్టిక్స్ అండ్ ప్రొబాబిలిటీ

ఇందులో పరిమిత సిలబస్ ఉంటుంది. ఫార్ములాలు, సూటిగా అడిగే ప్రశ్నలు దీని నుంచి అడుగుతారు.

Limits, Continuity & Applications of Derivatives

ఈ టాపిక్స్‌ నుంచి అడిగే ప్రశ్నలు కాన్సెప్ట్‌ ఆధారితంగా ఉంటాయి. అయితే సమాధానాలు సులువుగా గుర్తించవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.