JEE Main Result 2021 Session 3: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్‌ను ఇక్కడ చెక్ చేసుకోండి..

|

Aug 07, 2021 | 7:15 AM

JEE Main Result 2021 Session 3: జేఈఈ మేయిన్స్ 2021 సెషన్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఏ) ఈ ఫలితాలను ప్రకటించింది.

JEE Main Result 2021 Session 3: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్‌ను ఇక్కడ చెక్ చేసుకోండి..
Results
Follow us on

JEE Main Result 2021 Session 3: జేఈఈ మేయిన్స్ 2021 సెషన్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఏ) ఈ ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను nic.in, nta.ac.in లో పొందుపరిచింది. అయితే, బీటెక్/పేపర్ 1 స్కోర్ కార్డులను మాత్రమే విడుదల చేశారు. కాగా, విద్యార్థులు జేఈఈ మెయిన్ 2021 సెషన్ 4 కోసం మార్చిలో మరోసారి ప్రయత్నించవచ్చు.

జేఈఈ మెయిన్ 2021 సెషన్ 3 దేశ వ్యాప్తంగా, విదేశాలలో జులై 20, 22, 25, 27 తేదీల్లో కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్ మోడ్‌లో నిర్వహించారు. 334 నగరాల్లో మొత్తం 828 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారితంగా ఎగ్జామ్ నిర్వహించారు. కాగా, అభ్యర్థులకు స్కోర్/ర్యాంక్ కార్డు పంపబడదని ఎన్‌టిఏ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ స్కోర్/ర్యాంక్ కార్డులను జేఈఈ ప్రధాన వెబ్‌సైట్‌ www.nta.ac.in/jeemain.nta.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్-2021 ని ఎలా చెక్ చేసుకోవాలి:
అధికారిక వెబ్‌సైట్ – jeemain.nta.nic.in కి వెళ్లండి.
హోమ్‌పేజీలో ‘JEE మెయిన్-2021 సెషన్-3 ఫలితాలు’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ ‌పై క్లిక్ చేయాలి.
మీ JEE మెయిన్స్ ఫలితాలు కనిపిస్తాయి.
ఆ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని.. దానినే ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

జేఈఈ మెయిన్ రిజల్ట్ 2021 డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్..

జేఈఈలో టాప్ లేపిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు..
ఎన్టీఏ తాజాగా విడుదల చేసిన జేఈఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు టాప్ లేపారు. ఇంజనీరింగ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 8 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించి జాతీయ స్థాయిలో నిలిచారు. దేశవ్యాప్తంగా 17మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధిస్తే.. అందులో 8మంది ఏపీ, తెలంగాణ నుంచే ఉండటం విశేషం. ఈ ఎనిమిది మందిలోనూ ఏపీ చెందిన వారు నలుగురు కాగా, తెలంగాణకు చెందిన వారు నలుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఇక టాప్ 10 లో ఏకంగా ఐదుగురు తెలుగు అమ్మాయిలు చోటు సాధించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి 100 పర్సంటైల్‌ సాధించింది వీరే..
పోలు లక్ష్మీసాయి లోకేష్‌ రెడ్డి – తెలంగాణ
మాదుర్‌ ఆదర్శ్‌ రెడ్డి – తెలంగాణ
వెలవాలి కార్తికేయ సాయి వైదిక్‌ – తెలంగాణ
జోశ్యుల వెంకట ఆదిత్య – తెలంగాణ
కరణం లోకేష్‌ – ఆంధ్రప్రదేశ్‌
దుగ్గినేని వెంటక ఫణీష్‌ – ఆంధ్రప్రదేశ్‌
పసల వీర శివ – ఆంధ్రప్రదేశ్‌
కంచనపల్లి రాహుల్‌ నాయుడు – ఆంధ్రప్రదేశ్‌

Also read:

Simhachalam Lands Issue: సింహాచలం భూ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

HDFC Fire: లక్సెట్టిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో పూర్తిగా తగలబడిన బ్యాంకు, భారీగా ఆస్తినష్టం

Salaar Movie: శరవేగంగా ‘సలార్’ షూటింగ్.. నైట్ యాక్షన్ షాట్‎కు సిద్ధమైన ప్రభాస్..