JEE Advanced 2025 Exam Date: మరో వారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు.. పరీక్ష ఎప్పుడంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష సమీపిస్తుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మే 2వ తేదీతో ముగిసింది. జేఈఈ మెయిన్స్‌ రెండు విడతల్లో ప్రతిభ చూపిన తొలి 2.50 లక్షల మంది విద్యార్ధులు మాత్రమే..

JEE Advanced 2025 Exam Date: మరో వారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు.. పరీక్ష ఎప్పుడంటే?
JEE Advanced 2025 Exam

Updated on: May 07, 2025 | 2:52 PM

హైదరాబాద్‌, మే 7: దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష సమీపిస్తుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మే 2వ తేదీతో ముగిసింది. జేఈఈ మెయిన్స్‌ రెండు విడతల్లో ప్రతిభ చూపిన తొలి 2.50 లక్షల మంది విద్యార్ధులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు మే 11వ తేదీ నుంచి 18 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచునున్నట్లు ఐఐటీ కాన్పుర్‌ తెలిపింది. అనంతరం మే 18వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. పేపర్‌ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నాం 12 గంటల వరకు, పేపర్‌ 2 మద్యాహ్నాం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరగుతుంది. దేశవ్యాప్తంగా 222 నగరాలు, పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఐఐటీ కాన్పూర్‌ తెలిపింది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత కల్పించినప్పటికీ.. వీరిలో ఏటా పరీక్ష రాసేవారి సంఖ్య 1.60 లక్షలకు మించడం లేదని ఎన్టీయే తెలిపింది.

జోసా కౌన్సెలింగ్‌కు సీట్లు పెరిగే ఛాన్స్‌..

ఇక ఈ పరీక్ష అనంతరం జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లను కేటాయిస్తారు. దీని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్‌ మొదలయ్యే నాటికి కొత్త సీట్లపై స్పష్టత రానుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,740 బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడంతో 355 సీట్లు పెరిగాయి. ఐఐటీ తిరుపతిలో 244 సీట్లుంటే, మరో పది పెంచారు. వరంగల్‌ ఎన్‌ఐటీలో 989గా ఉన్న సీట్లను 1049కు పెంచారు. కొత్తగా 60 సీట్లతో సీఎస్‌ఈ (ఏఐ అండ్‌ డేటా సైన్స్‌) కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ సీట్ల సంఖ్యను సైతం 40 నుంచి 110 సీట్లకు పెంచారు. ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ సీఎస్‌ఈలోనూ సీట్లను పెంచారు. అలాగే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌) బ్రాంచిని కూడా 60 సీట్లతో కొత్తగా ప్రవేశపెట్టారు. ఈసారి అన్ని ఐఐటీల్లోనూ సీట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.