JNU New Delhi Recruitment 2022: రాత పరీక్షలేకుండా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. రూ.2 లక్షలకుపైగా జీతం..

|

Nov 08, 2022 | 4:40 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. 62 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

JNU New Delhi Recruitment 2022: రాత పరీక్షలేకుండా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు.. రూ.2 లక్షలకుపైగా జీతం..
JNU New Delhi Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. 62 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్‌ ఈస్తటిక్స్, స్కూల్ ఆఫ్ కంప్యూటేషనల్ అండ్‌ ఇంటిగ్రేటివ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ కంప్యూటేషనల్ అండ్‌ ఇంటిగ్రేటివ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్‌ సిస్టమ్స్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్, సెంటర్ ఆఫ్ స్టడీ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్ తదితర డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో మినహాయింపు ఉంటుంది.

అర్హత కలిగిన అభ్యర్ధులు డిసెంబర్‌ 5, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు రూ.2000లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారికి నెలకు రూ.1,44,200ల నుంచి రూ.2,18,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.