IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. వేత‌నం ఏడాది రూ. 60 ల‌క్ష‌లు.. ఎవ‌రు అర్హులంటే..

|

Apr 21, 2021 | 12:12 PM

IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకు ఛీఫ్ డేటా ఆఫీస‌ర్ పోస్టుల‌తో పాటు ఇత‌ర ఖాళీల‌ను భ‌ర్తీ చేయడానికి నోటిషికేష‌న్ జారీ చేశారు. అర్హ‌త‌, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు...

IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. వేత‌నం ఏడాది రూ. 60 ల‌క్ష‌లు.. ఎవ‌రు అర్హులంటే..
Idbi Bank
Follow us on

IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకు ఛీఫ్ డేటా ఆఫీస‌ర్ పోస్టుల‌తో పాటు ఇత‌ర ఖాళీల‌ను భ‌ర్తీ చేయడానికి నోటిషికేష‌న్ జారీ చేశారు. అర్హ‌త‌, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ idbibank.in ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇక ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీగా మే3, 2021గా నిర్ణ‌యించారు.

భ‌ర్తీ చేయ‌నున్న పోస్టులు..

ఐడీబీఐ బ్యాంకు తాజాగా విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ద్వారా.. ఛీఫ్ డేటా ఆఫీస‌ర్‌, ప్రోగ్రామ్ మేనెజ్ మెంట్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (హెడ్‌), డిప్యూటీ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్, డిప్యూటీ ఛీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్‌, ఛీఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌, డిజిట‌ల్ బ్యాంకింగ్ (హెడ్‌) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. పైన తెలిపిన ఒక్కో పోస్టులో ఒక్కో ఖాళీ ఉంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి విద్యార్హ‌త‌, ఎంత వ‌య‌సు ఉండాలి లాంటి పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

ఎలా ఎంపిక చేస్తారు…

ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను వారి విద్యార్హ‌త‌లు, అనుభ‌వం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం వారిని ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వూ ద్వారా ఎంపిక చేసుకుంటారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆన్‌లైన్ అప్లికేష‌న్‌ల‌ను 20 ఏప్రిల్ 2021 నుంచి స్వీక‌రిస్తారు. అప్లికేష‌న్‌ల‌కు చివ‌రి తేదీ 03 మే 2021గా నిర్ణ‌యించారు.
* ఇందులో ఎంపికైన అభ్య‌ర్థులు ముంబ‌యిలో ప‌ట్ట‌ణంలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

‌Also Read: UGC NET 2021 May Exam: కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. యూజీసీ నెట్ పరీక్ష వాయిదా..

NATA 2021 Result: నేడే ఎన్‌ఏటీఏ పరీక్షా ఫలితాలు.. ఇలా సులువుగా చెక్ చేసుకోండి..

NTPC Recruitment 2021: ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తులకు చివరి తేదీ మే 16