రూ.2.08 లక్షల జీతంతో ISROలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?
బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC)లో సైంటిస్ట్/ఇంజినీర్-ఎస్‌డీ గ్రూప్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.2,08,700 వరకు జీతం లభిస్తుంది. ఈ కింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..

భారత అంతరిక్ష సంస్థ ISRO ఆధ్వర్యంలోని బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC)లో గ్రూప్-ఏ కేటగిరీలోని సైంటిస్ట్/ఇంజినీర్-ఎస్‌డీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కిద మొత్తం 6 సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్‌డీ (గ్రూప్-ఏ) పోస్టులను పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
పోస్టులకు సంబంధించిన పరిశోధనా విభాగాలు..
- బయోఇన్‌స్ట్రుమెంటేషన్ / బయోఫిజిక్స్ / మెడికల్ ఫిజిక్స్
- డెవలప్‌మెంటల్ బయాలజీ / బయోటెక్నాలజీ
- సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ / సెల్ బయాలజీ
- కంప్యూటేషనల్ బయాలజీ / సిస్టమ్స్ బయాలజీ / బయోఇన్ఫర్మేటిక్స్
- బయోమెడికల్ ఇంజినీరింగ్ / బయోమెడికల్ సైన్స్
ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టుకు సంబంధించిన స్పెషలైజేషన్‌లో విద్యార్హత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత విభాగంలో తమ విద్యార్హత సరిపోతుందో లేదో అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్ట్ 30, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ముందుగా అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన పే స్కేల్ అందించనున్నారు. నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు వేతనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా వర్తించే అవకాశం ఉంది.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యే ముందు నమోదు చేసిన వివరాలను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. పీహెచ్‌డీ అర్హతతో అంతరిక్ష, జీవశాస్త్రం, బయోమెడికల్ పరిశోధన రంగాల్లో కెరీర్‌ను కొనసాగించాలనుకునే వారికి ఈ నియామకం మంచి అవకాశంగా నిలుస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.
ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




