ISP Recruitment 2022: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నాసిక్‌రోడ్‌లో ఉన్న ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ISP)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో వెల్ఫేర్ ఆఫీసర్ (01), జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (15) ఖాళీలు ఉన్నాయి.
* వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. అంతేకాకుండా సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
* జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థు వయసు 28 ఏళ్లు ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* వీటిలో వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 29,740 నుంచి రూ.103000 అందిస్తారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికన వారికి నెలకు రూ.21,540, రూ.77,160 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తు చేసుకునే వారు రూ. 600 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 10-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..