Campus Interviews: ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు.. అటు ఫ్రెషర్స్‌‌కు షాక్.. ఐటీ దిగ్గజ సంస్థ కీలక ప్రకటన

ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు తమ కాలేజీలకు పెద్ద సంస్థలు రావాలని ప్రయత్నాలు చేస్తాయి. దానివలన ప్రతి సంవత్సరం తమ కాలేజీల్లో విద్యార్ధుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తాయి. గత ఏడాది వరకూ ఇన్ఫోసిస్, టీసిఎస్ వంటి పెద్ద సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి భారీ సంఖ్యలో విద్యార్ధులను క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్ చేసుకునేవి. కానీ.. ప్రస్తుతం పరిస్థితి మారింది.

Campus Interviews: ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు.. అటు ఫ్రెషర్స్‌‌కు షాక్.. ఐటీ దిగ్గజ సంస్థ కీలక ప్రకటన
Engineering Students

Updated on: Oct 15, 2023 | 1:54 PM

ఇంజనీరింగ్ కాలేజీలు తమ విద్యార్ధులలో ఎక్కువ మంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో మంచి ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటాయి. అలాగే ఫ్రెషర్స్ ని తీసుకుని ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వారిని తమ సంస్థలో తక్కువ ఖర్చుతో నియమించుకోవచ్చని టెక్ కంపెనీలు చూస్తుంటాయి. ఇలా కాలేజీలు – టెక్ సంస్థలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు తమ కాలేజీలకు పెద్ద సంస్థలు రావాలని ప్రయత్నాలు చేస్తాయి. దానివలన ప్రతి సంవత్సరం తమ కాలేజీల్లో విద్యార్ధుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తాయి. గత ఏడాది వరకూ ఇన్ఫోసిస్, టీసిఎస్ వంటి పెద్ద సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి భారీ సంఖ్యలో విద్యార్ధులను క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్ చేసుకునేవి. కానీ.. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూల వైపు పెద్ద సంస్థలు వెళ్ళడం కష్టం అనే అంచనాలు ఇండస్ట్రీ నిపుణులు అంచనావేస్తూవచ్చారు. ఇప్పుడు ఆ అంచనా నిజం చేస్తూ ఇన్ఫోసిస్ నుంచి కీలక ప్రకటన వచ్చింది.

భారతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లడం లేదు. ఈ సమాచారాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) నీలాంజన్ రాయ్ అధికారికంగా ప్రకటించారు.  ఇన్ఫోసిస్ రెండో త్రైమాసిక ఫలితాలపై రాయ్ మాట్లాడుతూ.. గతేడాది 50 వేల మంది ఫ్రెషర్లను కంపెనీ రిక్రూట్ చేసుకుందని వెల్లడించారు. తాము గత సంవత్సరం అవసరమైన దానికంటే ఎక్కువ నియామకాలు చేసామని చెప్పుకొచ్చారు. అందువల్ల జనరేటివ్ AIలో శిక్షణ పొందుతున్న చాలా మంది ఫ్రెషర్లు ఇప్పటికీ కంపెనీలో ఉన్నారు. అందుకే ఈ సంవత్సరం క్యాంపస్ సెలక్షన్‌కి వెళ్లడం లేదని తెలిపారు. అయితే ప్రతి మూడు నెలలకోసారి కంపెనీ ఉద్యోగుల సంఖ్యను ఎనలైజ్ చేస్తుందని చెప్పారు. అప్పుడు అవసరాన్ని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వివరించారు. మొత్తానికి ఈ ఏడాది క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్లడం లేదన్న ఇన్ఫోసిస్ సంస్థ ప్రకటన అటు ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు.. అటు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్న ఫ్రెషర్స్ కూడా పెను షాక్‌గా పరిణమించింది. దీంతో ఫ్రెషర్స్ ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టిసారించాల్సిన పరిస్థితి నెలకొంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ వైపే ఇన్ఫో..

వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌పై కంపెనీ సిఇఒ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ, పని చేయడానికి మా విధానం అనువైనదని అన్నారు. కాలానుగుణంగా ఇంటి నుంచి పని చేసే సంస్కృతి కూడా సరైనదని ఆయన అన్నారు. అందువల్ల, కంపెనీ ప్రత్యేక ప్రాజెక్ట్‌లు లేదా క్లయింట్ సంబంధిత పని కోసం వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనిని కొనసాగిస్తుంది. అవసరమైతే ఉద్యోగులను కార్యాలయానికి పిలిపిస్తామని వెల్లడించారు.

సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్య 3.28 లక్షలు. అదే సమయంలో, కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల కోసం ఇన్ఫోసిస్ విధానం TCS వంటి కంపెనీలకు భిన్నంగా ఉంటుంది. TCS తన 6.14 లక్షల మంది ఉద్యోగులను ఆఫీసు నుంచి పని చేయాలని కోరింది. కానీ ఇన్ఫోసిస్ దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది.

లాభాల్లో ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. అక్టోబర్ 12న, కంపెనీ క్యూ2ఎఫ్‌వై24 ఫలితాలను అంటే 2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. దీనితో పాటు డివిడెండ్ కూడా ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ₹6,212 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 3% వృద్ధి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది ₹6,026 కోట్లు. Q1FY24లో కంపెనీ నికర లాభం ₹5,945 కోట్లు.

మరిన్ని కెరీర్ వార్తలు చదవండి