Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు.. అర్హులెవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

|

Sep 12, 2021 | 10:54 AM

Indian Navy SSC Recruitment 2021: ఇండియన్‌ నేవీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ..

Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు.. అర్హులెవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Follow us on

Indian Navy SSC Recruitment 2021: ఇండియన్‌ నేవీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ 2022 జూన్‌ (ఏటీ 22) కోర్సు కోసం అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 181 ఖాళీలకు గాను ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌ (90), ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్‌) -18, టెక్నికల్‌ బ్రాంచ్‌ (73) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 201-09-2021న ప్రారంభమవుతుండగా 05-10-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Mahesh Bank Recruitment: మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

NEET 2021: నీట్ ఎగ్జామ్‌కు సర్వం సిద్ధం.. పరీక్ష రాయనున్న 16 లక్షల మంది విద్యార్థులు

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఎందుకంటే..?