Indian Army SSC Tech Recruitment 2022: ఇంజినీరింగ్ చదివిన నిరుద్యోగులకు ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 180 పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఐతే దరఖాస్తు ప్రక్రియ నేడు (ఏప్రిల్ 6) మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా రిక్రూట్మెంట్ బోర్డు సూచించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసంజ
ఖాళీల ఖాళీలు: 180
పోస్టుల వివరాలు: SSC (Tech), SSCW (Tech), Widows of Defence Personnel
విద్యార్హత: ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి: అక్టోబర్ 1, 2022 నాటికి 20 నుంచి 27 ఏళ్ల వయసుండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 6 మధ్యాహ్నం 3 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: