Indian Army SSC (Tech) and SSCW (Tech) Recruitment 2022: భారత సైన్యం పనిచేయాలనుకునే యువతకు అద్భుతావకాశం! ఇండియన్ ఆర్మీకి చెందిన చైన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 2023 ఎప్రిల్ సంవత్సరానికి గానూ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 60వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్, 31వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సులకు గానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 191 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్ పోస్టులు 175, ఎస్ఎస్‌సీ (టెక్) ఉమెన్ పోస్టులు 14, విడోస్ డిఫెన్స్ పర్సనల్ పోస్టులు 2 చొప్పున ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పాసైన అవివాహితులైన పురుషులు, మహిళలతోపాటు, ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు సంబంధించిన విడో అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్/ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఈ/బీటెక్ అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్ టెక్నికల్ పోస్టులకు ఏదైనా డిగ్రీలో అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా ఏప్రిల్ 1, 2023 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపుండాలి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆగస్టు 24, 2022 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా రిక్రూట్‌మెంట్ బోర్డు సూచిస్తోంది.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.