Telangana: విద్యార్థులకు అలర్ట్‌.. ఈసారి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో రానున్న మార్పులు ఇవే..

|

Oct 12, 2021 | 2:34 PM

Telangana 10th Exams: కరోనా కారణంగా విద్యార్థులపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 11 ప్రశ్నాపత్రాలు ఉండగా వాటిని ఇప్పుడు 6 కుదిస్తూ ప్రకటన చేశారు. వీటితో పాటు మరికొన్ని కీలక మార్పులు చేశారు. అవేంటంటే..

1 / 6
కరోనా కారణంగా విద్యార్థులపై పెరిగిన ఒత్తిడిని తగ్గించే క్రమంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

2 / 6
గతంలోలా 11 పరీక్షలు కాకుండా వచ్చే ఏడాది జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కేవలం 6 పరీక్షా పత్రాలు మాత్రమే ఉండనున్నాయి.

3 / 6
అంతేకాకుండా విద్యార్థుల వెసులుబాటు కోసం 1 నుంచి 10 తరగతుల పరీక్షలకు గతేడాది మాదిరిగానే 70 శాతం సిలబస్‌ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

4 / 6
ఇక ఇప్పటి వరకు ఒక్కో పరీక్షా సమయం 2.45 గంటలు ఉండేది. దీనికి కారణం ఒక్కో పరీక్షకు రెండు ప్రశ్నాపత్రాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే ప్రశ్నాపత్రం ఉండడం, 80 మార్కులకు నిర్వహిస్తుండడంతో పరీక్ష సమయాన్ని 3.15 గంటలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

5 / 6
మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా కలుపుతారు. అయితే గతంలో నాలుగు ఇంటర్నల్‌ పరీక్ష (ఎఫ్‌ఏ)లను నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను రెండుకు తగ్గించారు. ఈ రెండింటిలో వచ్చిన సగటు మార్కులకు, 80 మార్కుల ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్కులను కలుపుతారు.

6 / 6
గతేడాది వరకు భౌతికశాస్త్రానికి, జీవ శాస్త్రానికి వేర్వేరుగా పరీక్షలు జరిపేవారు కానీ ఈసారి ఒకే పరీక్షగా నిర్వహిస్తారు. అయితే రెండు ప్రశ్నా పత్రాలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నాపత్రానికి సంబంధించిన సమాధానాలను వేరు వేరు పేపర్‌లలో రాయాల్సి ఉంటుంది.