
న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్).. 260 సీనియర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కన్సల్టెంట్, హెడ్ ఆపరేషన్స్, సీనియర్ ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనస్థీషియా, రేడియేషన్ ఆంకాలజీ, మాలిక్యులర్ అండ్ సెల్యులార్ మెడిసిన్, ఎపిడెమియాలజీ, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మెడికల్ ఆంకాలజీ, క్రిటికల్, ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్, హెపటాలజీ, నెఫ్రాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్, మెడిసిన్, యూరాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/డిప్లొమా/డిగ్రీ/ బీఎస్సీ నర్సింగ్/ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 28, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.590లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/వికలాంగ/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.