IIM Bangalore క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో 513 విద్యార్ధులకు 662 ఆఫర్లు..గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌తో సహా టాప్ కంపెనీలు..

|

Feb 24, 2022 | 8:23 AM

ఐఐఎమ్‌ బెంగళూరు క్యాంపస్‌ విద్యార్ధులకు అదిరిపోయే ప్లేస్‌మెంట్ ఆఫర్లు వచ్చాయి. 2022 సెషన్‌కు హాజరయిన 513 మంది విద్యార్థులకు (PGP, PGPBA క్లాసులకు చెందిన 2020-22 బ్యాచ్‌ విద్యార్ధులు) ప్రముఖ కంపెనీల నుంచి ఏకంగా 662..

IIM Bangalore క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో 513 విద్యార్ధులకు 662 ఆఫర్లు..గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌తో సహా టాప్ కంపెనీలు..
Iim Bangalore
Follow us on

IIM Bangalore Campus Placements 2022: ఐఐఎమ్‌ బెంగళూరు క్యాంపస్‌ విద్యార్ధులకు అదిరిపోయే ప్లేస్‌మెంట్ ఆఫర్లు వచ్చాయి. 2022 సెషన్‌కు హాజరయిన 513 మంది విద్యార్థులకు (PGP, PGPBA క్లాసులకు చెందిన 2020-22 బ్యాచ్‌ విద్యార్ధులు) ప్రముఖ కంపెనీల నుంచి ఏకంగా 662 ఆఫర్‌లు వచ్చాయి. IIM Bangalore బుధవారం (ఫిబ్రవరి 23) విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ ఏడాది అన్ని సెక్టార్లలో ఆఫర్లు పెరిగినట్లు ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. మొత్తంమీద ఈ ఏడాది ఆఫర్‌ల సంఖ్యలో 37% పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా కన్సల్టింగ్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ రోల్‌లలో ఎక్కువ ప్లేస్‌మెంట్లు ఉన్నట్లు తెల్పింది. విద్యార్ధులు కూడా మొదటి ప్రయారిటీ స్ట్రాటజీ కన్సల్టింగ్, ఆ తర్వాత స్థానాల్లో ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ సెక్టార్లకు ఇస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ తెల్పింది. 51 కన్సల్టింగ్ కంపెనీలు యాక్సెంచర్ నేతృత్వంలో 248 ఆఫర్‌లను అందించగా.. తర్వాత 30 ఆఫర్‌లతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ముందుకొచ్చింది. ఇ

ఇక తాజా ప్రకటన ప్రకారం టాప్ రిక్రూటర్లలో కెర్నీ (27), బెయిన్ & కంపెనీ (26), మెకిన్సే & కంపెనీ (22), ఎర్నెస్ట్ & యంగ్ (9), ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (9), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (9), అల్వారెజ్ & మార్సల్ ఉన్నారు. (7), ఆర్థర్ డి. లిటిల్ (7), డెలాయిట్ (5), ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ (5), కేపీఎమ్జీ (5), స్ట్రాటజీ& (5), ఆక్టస్ అడ్వైజర్స్ (4), ఆలివర్ వైమాన్ (4), ఐబీఎమ్‌ కన్సల్టింగ్ (2), EY-పార్థెనాన్ సింగపూర్ (2), ఇతర కన్సల్టింగ్ సంస్థలు 19 ఆఫర్లతో ముందుకొచ్చాయి.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ డొమైన్‌లోని ప్రముఖ రిక్రూట్‌ కంపెనీల్లోల Microsoft, OYO, Amagi Labs, Oracle, Atlassian ,Google కూడా ఉన్నాయి. ఇక అమెజాన్ (37), Paytm (16), Flipkart (6), Myntra (6) సహా ఈ-కామర్స్ స్పేస్‌లో మొత్తం 65 ఆఫర్లతో ముందుకొచ్చాయి. ఫైనాన్స్ డొమైన్‌లో మొత్తం 71 ఆఫర్లున్నాయి. ఈ డొమైన్‌లోని టాప్ రిక్రూటర్లలో గోల్డ్‌మన్ సాచ్స్, అవెండస్ క్యాపిటల్, సిటీ బ్యాంక్, డ్యుయిష్ బ్యాంక్, రోత్‌స్చైల్డ్ కూడా ఉన్నాయి. జనరల్ మేనేజ్‌మెంట్‌లో 52, ఆర్పీజీ గ్రూప్ 10 ఆఫర్లతో ముందుకొచ్చాయి. సేల్స్ అండ్‌ మార్కెటింగ్‌లో 40 ఆఫర్‌లతో.. టాప్ రిక్రూటర్ కంపెనీలుగా హెయూఎల్‌, ఏషియన్ పెయింట్స్, శామ్‌సంగ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కంపెనీలు వచ్చాయి. ఆపరేషన్స్ రోల్స్‌లో 13, అనలిటిక్స్‌ సెక్టార్‌లో 32 ఆఫర్లతో ముందుకొచ్చింది. ప్లేస్‌మెంట్ వీక్‌లో మొదటి రోజు ముగిసే సమయానికే ఐఐబీఎమ్‌లోని విద్యార్థులందరూ ప్లేస్‌మెట్లు సాధించినట్లు.. కెరీర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ సీనియర్ మేనేజర్ డాక్టర్ రూప అద్యాషా తెలిపారు.

Also Read:

NIFT Entrance Exam 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే..