IGNOU online Spanish and French language courses: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU ) జనవరి 2022 సెషన్‌కు సంబంధించి స్కూల్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ (School of Foreign Languages).. స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో ఆన్‌లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించింది. స్పానిష్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ (CSLCOL), ఫ్రెంచ్ లాంగ్వేజ్ (CFLOL)లో సర్టిఫికేట్ కోర్సులు అందించనుంది. ఈ భాషలను అర్థం చేసుకోవడం, చదవడం, రాయడం, వినడం, మాట్లాడటంలో నైపుణ్యాలను పెంపొందించడంలో కొత్త కోర్సులు సహాయపడతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ignouiop.samarth.edu.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు నెలల వ్యవధికలిగిన ఈ సర్టిఫికేట్ కోర్సులకు ఫీజు రూ.4,500గా నిర్ణయించింది. భ్యాసకులు భాషా నైపుణ్యాలు (ఉచ్చారణ, వ్యాకరణం, పదజాలం, ప్రాథమిక సంభాషణ సామర్థ్యం) పెంపొందించడమే ఈ కోర్సుల ముఖ్య ఉద్ధేశ్యం. రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి స్పానిష్ భాషలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక ఫ్రెంచ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్.. ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ పెడగాజీ ఆధారంగా రూపొందించిన ఈ కోర్సు యూరోపియన్ భాషా నైపుణ్యాల పెంపుకు ఉపయోగపడేలా ఉంటుంది. ఈ కోర్సులో ప్రవేశం కోరే అభ్యర్ధులు రూ. 6,600 చెల్లించాల్సి ఉంటుందని కోఆర్డినేటర్ డాక్టర్ దీపన్విత శ్రీవాస్తవ తెలిపారు. స్పెయిన్, ఫ్రెంచ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఇతర వివరాల కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignouiop.samarth.edu.inను సందర్శించాలని అభ్యర్ధులకు సూచించారు.
Also Read: