IGNOU Recruitment: ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

| Edited By: Ravi Kiran

Sep 22, 2021 | 7:28 AM

IGNOU Recruitment: ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) పలు పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ క్యాంపస్‌లో పలు విభాగాల్లో..

IGNOU Recruitment: ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Follow us on

IGNOU Recruitment: ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) పలు పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ క్యాంపస్‌లో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో టెక్నికల్‌ మేనేజర్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బీసీఏ/బీఎస్సీ/బీవీవోసీ/బీఏ, ఎంసీఏ/బీటెక్‌/బీఈ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత పొందాలి.

* అభ్యర్థుల వయసు 37 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/మహిళలు రూ. 600, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) / ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ. 1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల ప్రక్రియ 20-09-2021న ప్రారంభమవుతుండగా.. 19-10-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: UGC NET 2021: త్వరలో UGC NET అడ్మిట్ కార్డ్ విడుదల.. తాజా అప్‌డేట్‌ ఏంటంటే..?

Jr College Admissions: సెప్టెంబరు 22 నుండి TTD జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్లు

SCCL Jobs 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సింగరేణిలో క్లరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. త్వరలోనే..