IDBI Recruitment 2023: ఐడీబీఐ బ్యాంక్‌లో 2100 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ అర్హతతో బ్యాంక్‌ కొలువులు

|

Nov 23, 2023 | 12:56 PM

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌) 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ (జేఏఎం), ఎగ్జిక్యూటివ్ సేల్స్‌ అండ్ ఆపరేషన్స్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 2100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేస్తారు. డిగ్రీ అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 22వ తేదీ నుంచి..

IDBI Recruitment 2023: ఐడీబీఐ బ్యాంక్‌లో 2100 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ అర్హతతో బ్యాంక్‌ కొలువులు
IDBI Recruitment
Follow us on

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌) 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ (జేఏఎం), ఎగ్జిక్యూటివ్ సేల్స్‌ అండ్ ఆపరేషన్స్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 2100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేస్తారు. డిగ్రీ అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 22వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 6, 2023వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.

పోస్టుల వివరాలు..

  • జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ ‘ఒ’ పోస్టులు 800 వరకు ఉన్నాయి. వీటిల్లో ఎస్సీ కేటగిరీకి 120 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి 60 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 216 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి 80 పోస్టులు, యూఆర్‌ కేటగిరీకి 324 పోస్టులు కేటాయించారు.
  • ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఎగ్జిక్యూటివ్‌- సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఈఎస్‌వో) పోస్టులు 1300 వరకు ఉన్నాయి. వీటిల్లో ఎస్సీ కేటగిరీకి 200 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి 86 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 326 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి 130 పోస్టులు, యూఆర్‌ కేటగిరీకి 558 పోస్టులు కేటాయించారు.

ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నవంబర్‌ 1, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 6, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ కేటగిరీకి చెందిన వారు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నెలకు రూ.29,000 నుంచి రూ.31,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: నవంబర్‌ 22, 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తులు చివరి తేదీ: డిసెంబర్ 6, 2023.
  • దరఖాస్తు రుసుము చెల్లించడానికి ప్రారంభ తేదీ: నవంబర్ 22, 2023.
  • దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 6, 2023.
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీలు..
    జేఏఎం పోస్టులకు డిసెంబర్ 31, 2023 రాత పరీక్ష నిర్వహిస్తారు.
    ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు డిసెంబర్ 30, 2023 రాత పరీక్ష నిర్వహిస్తారు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.