ICSIL Jobs: మహిళకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే!

|

Jan 29, 2022 | 3:49 PM

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) సూపర్‌వైజర్ పోస్టుల (Supervisor Jobs) భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

ICSIL Jobs: మహిళకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే!
Icsil Recruitment
Follow us on

ICSIL Recruitment 2022: భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) సూపర్‌వైజర్ పోస్టుల (Supervisor Jobs) భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 46

ఖాళీల వివరాలు: మహిళా సూపర్‌వైజర్లు

అర్హతలు: సోషియాలజీ/చైల్డ్ డెవలప్‌మెంట్/న్యూట్రీషన్/సోషల్ వర్క్‌లో గ్రాడ్యుయేసన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు పదేళ్ల అనుభవం ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు అర్హులు. ఏడాది పాటు అనుభవం ఉన్న అభ్యర్దులకు ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.21,184లు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్/డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP 10th class Exams 2022: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుకు ఇక 6 రోజులే మిగిలున్నాయ్..