ICSE, ISC Semester 1 Result 2022: 10,12 తరగతుల ఫలితాలు ఫిబ్రవరి 7న విడుదల!

|

Feb 05, 2022 | 2:16 PM

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) 10వ తరగతి, ISC 12వ తరగతికి సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 7 (సోమవారం), 2022న ఉదయం 10 గంటలకు విడుదలకానున్నాయి...

ICSE, ISC Semester 1 Result 2022: 10,12 తరగతుల ఫలితాలు ఫిబ్రవరి 7న విడుదల!
Cisce Results
Follow us on

CBSE 10th, 12th Results 2021: సీబీఎస్సీ 10, 12వ తరగతికి సంబంధించిన టర్మ్ 1 బోర్డు పరీక్షల (2021) ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తోంది. ఫలితాలను త్వరలో ప్రకటించనున్నట్లు సీబీఎస్సీ తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఐతే కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) 10వ తరగతి, ISC 12వ తరగతికి సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 7 (సోమవారం), 2022న ఉదయం 10 గంటలకు విడుదలకానున్నాయి. ఫలితాలు విడుదలైన తర్వాత, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల cisce.org లేదా results.cisce.org.లలో ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. కాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్ I పరీక్షలు నవంబర్ 30 నుండి డిసెంబర్ 11 వరకు జరిగాయి. అలాగే 12వ తరగతికి డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 22 వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మార్కుల రూపంలోనే ప్రకటించాలని బోర్డు నిర్ణయించింది. టర్మ్ I పరీక్షల తర్వాత ఏ విద్యార్థిని పాస్, కంపార్ట్‌మెంట్ లేదా ఎసెన్షియల్ రిపీట్ కేటగిరీలో ఉంచరు. టర్మ్ 2 పరీక్షల తర్వాత 10, 12వ తరగతి తుది ఫలితాలు వెల్లడిస్తారు. విద్యార్ధులు ఇంటర్‌నెట్‌లో కనిపించే వివిధ ఇన్ఫర్మేషన్‌ను చూసి గంధరగోళానికి గురవ్వకుండా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే తనిఖీ చేసుకోవల్సిందిగా సీబీఎస్సీ సూచించింది.

10, 12వ తరగతి ఫలితాలను సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లు cbse.gov.inలో లేదా cbseresults.nic.inలో తనిఖీ చేసుకోవచ్చు. డిజిలాకర్ యాప్‌లో కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా digilocker.gov.in వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు. అదేవిధంగా UMANG మొబైల్ అప్లికేషన్‌లో కూడా రిజల్ట్స్ పొందవచ్చు.

విద్యార్ధులు ఫలితాల కోసం సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లలో రోల్ నంబర్, స్కూల్ నంబర్‌ని ఉపయోగించి మార్కుల షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెల్పింది.

Also Read:

SSC Results: ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాల తేదీలు విడుదల.. సీజీఎస్‌ఎల్, సీజీఎల్ రిజల్ట్స్ ఎప్పుడంటే!