AP Anganwadi Jobs 2025: ఏడో తరగతి అర్హతతో.. అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మీరు దరఖాస్తు చేశారా?

ICDS Visakhapatnam Recruitment 2025 Notification: రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్‌ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న అంగన్యాడీ హెల్పర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద..

AP Anganwadi Jobs 2025: ఏడో తరగతి అర్హతతో.. అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మీరు దరఖాస్తు చేశారా?
Visakhapatnam Anganwadi Jobs

Updated on: Oct 08, 2025 | 10:43 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్‌ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న అంగన్యాడీ హెల్పర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 53 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థలు ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబరు 14, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.

డివిజన్ వారిగా పోస్టుల వివరాలు ఇవే..

  • భీమునిపట్నంలో పోస్టుల సంఖ్య: 11
  • పెందుర్తిలో పోస్టుల సంఖ్య: 21
  • విశాఖపట్నంలో పోస్టుల సంఖ్య: 21

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పని సరిగా 7వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత గ్రామంలో కాపురం ఉంటున్న వారై ఉండాలి. స్థానిక మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2025 నాటికి 21 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబరు 14, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల మహిళా అభ్యర్థులు సంబంధిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయంకు వెళ్లి ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు పూరించాలి. లేదంటే నేరుగా దరఖాస్తు చివరి తేదీ నాటికి పోస్టు ద్వారా పంపించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారాంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7000 వరకు జీతంగా చెల్లిస్తారు.

విశాఖపట్నం జిల్లా అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.