
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) భారీ శుభవార్త చెప్పింది. ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT)-XVI నియామకాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 6,715 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
IBPS బ్యాంకు ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 21, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక మొత్తం నాలుగు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష, అనంతరం మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టులో, మెయిన్స్ పరీక్షలు అక్టోబరులో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ ప్రాథమిక వేతనం రూ.48,480 నుంచి రూ.85,920 వరకు స్కేల్ ప్రకారం లభిస్తుంది. అదనంగా డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ఇతర భత్యాలు కూడా అందజేస్తారు.
IBPS బ్యాంకు ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.