IBPS Clerk Mains Result 2021: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

|

Apr 01, 2021 | 4:13 PM

IBPS Clerk Mains Result 2021: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను నిర్వహించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఫలితాలు విడుదల చేసింది...

IBPS Clerk Mains Result 2021: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
Ibps Clerk Results
Follow us on

IBPS Clerk Mains Result 2021: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను నిర్వహించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఫలితాలు విడుదల చేసింది. ఏప్రిల్ 1న విడుదల చేసిన ఈ ఫలితాలు ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఇదిలా ఉంటే ఐబీపీఎస్ ఈ నోటిఫికేషన్‌ను దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 2257 క్లర్క్ పోస్టుల భర్తీకి జారీచేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మెయిన్స్ పరీక్షను గత ఫిబ్రవరి 28న నిర్వహించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inలో ఫలితాలు చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్‌లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఇక ఈ నోటిఫికేషన్‌లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులు.. స్థానిక భాషల్లో నైపుణ్యం ఉన్నట్లు సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. పోస్టులను ఏప్రిల్ 2021లో భర్తీ చేయనున్నట్లు సమాచారం.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

* ముందుగా అధికారిక వెబ్‌సైట్ IBPS on ibps.in ఓపెన్ చేయాలి.
* అనంతరం హోమ్ పేజ్‌లో ఉన్న ‘ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ రిజల్ట్స్ 2020’ లింక్‌ను క్లిక్ చేయాలి.
* తర్వాత లాగిన్ కోసం అవసరమైన సమాచారాన్ని అందించింది సబ్మిట్ బటన్‌పై నొక్కాలి.
* వెంటనే ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
* ఫలితాలు చూసుకున్న తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకున్న కాపీని జాగ్రత్తపరుచుకోవాలి.

Also Read: Telangana Inter: ప్రాక్టికల్స్ వాయిదా వేసే ఆలోచనలో తెలంగాణ ఇంటర్ బోర్డ్.. ఐపీఈ కంటే ముందే..?

Railway Recruitment 2021: పదో తరగతి పాసైన వారికి శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్‌ 16

FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?