
భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు నియామకాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిషికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు (1/ 2027) బ్యాచ్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదంటే మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఏదైనా ఒక విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2006 నుంచి జులై 1, 2009 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 1, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.550లతోపాటు జీఎస్‌టీ రుసుమును కూడా చెల్లించవల్సి ఉంటుంది.
ఫేజ్ 1లో ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఫేజ్ 2లో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది. ఇక ఫేజ్ 3లో మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. చివరిగా ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్ధుల వివరాలు వెల్లడిస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్షలు మార్చి 30, 31 తేదీల్లో నిర్వహిస్తారు.
ఇండియన్ ఎయిర్ పోర్స్ అగ్నివీర్ వాయు 2026 ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.