
కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) మార్కెటింగ్ డివిజన్.. 2026-27 సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో మొత్తం 358 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 31, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జులై 31 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 31, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండా అభ్యర్థులను అకాడమిక్ మెరిట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, సంస్థ నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.
హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.