Knowledge: భారతీయ రైల్వేలో 22,593 రైళ్లు ఉన్నాయి. వీటిలో 9,141 రైళ్లు గూడ్స్ రైళ్లు. ఇవి సరుకు రవాణా చేస్తాయి. ప్రతిరోజూ దాదాపు 203.88 మిలియన్ టన్నుల సరుకు రవాణా అవుతోంది. మిగతావి అంటే13,452 ప్యాసింజర్ రైళ్లు. ఇవి ప్రతిరోజు 2.5 కోట్ల మంది ప్రయాణీకులని వారి గమ్యస్థానాలకి చేర్చుతున్నాయి. భారతీయ రైల్వేలు దాదాపు దేశం మొత్తాన్ని కలుపుతాయి. ప్యాసింజర్ రైళ్లు వివిధ పేర్లతో దేశం మొత్తం నడుస్తాయి. అయితే రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి ఒకే పేరుతో అనేక రైళ్లు ఉంటాయి. ఇది దేశ రాజధానిని వివిధ రాష్ట్రాల రాజధానులతో కలుపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైళ్లకు ఏ ప్రాతిపదికన పేర్లు పెడతారనే విషయం తెలుసుకుందాం.
భారతీయ రైలును 3 వర్గాలుగా విభజించారు
భారతీయ రైళ్లకి మూడు విషయాల ఆధారంగా పేర్లు పెడుతారు. స్థలాల పేరుపైనా, నిర్దిష్ట ప్రదేశాల పేరుపైన, పార్కులు స్మారక చిహ్నాల పేరుపైనా పెడుతారు.
స్థలాల పేరుపైనా..
కొన్ని రైళ్లకి స్థలాల పేరుపైనా పేర్లు పెడతారు. ఉదాహరణకి
1. కల్కా మెయిల్ హౌరా నుంచి కల్కా వరకు నడుస్తుంది.
2. ముంబై ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి ముంబైకి నడుస్తుంది.
3. జైపూర్ ఎక్స్‌ప్రెస్ మైసూర్ నుంచి జైపూర్ వరకు నడుస్తుంది.
నిర్దిష్ట ప్రదేశాలు, స్మారక చిహ్నాల పేరుపైనా..
చాలా రైళ్లు నిర్దిష్ట ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, స్మారక చిహ్నాల ప్రాంతాల గుండా వెళతాయి. అందువల్ల వాటి పేర్లు వచ్చేవిధంగా పేర్లు పెడుతారు. ఈ రైళ్లలో చాలా వరకు నది పేర్లు, పార్కుల పేర్లు, ప్రాంతాల పేర్లు ఉంటాయి. ఉదాహరణకి
1. ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి హౌరా వరకు నడుస్తుంది.
2. మలబార్ ఎక్స్‌ప్రెస్ మంగళూరు నుంచి తిరువనంతపురం వరకు నడుస్తుంది.
3. జోధ్‌పూర్ నుంచి ఇండోర్ వరకు రణతంబోర్ ఎక్స్‌ప్రెస్.
4. కార్బెట్ పార్క్ ఎక్స్‌ప్రెస్ లేదా కాజిరంగా ఎక్స్‌ప్రెస్.
5. చెన్నై నుంచి హైదరాబాద్‌కు చార్మినార్ ఎక్స్‌ప్రెస్, తాజ్ ఎక్స్‌ప్రెస్
రాజధానులని అనుసంధానం చేసే రైళ్లు
రాజధాని ఎక్స్‌ప్రెస్ : ఇది దేశ రాజధాని ఢిల్లీని వివిధ రాష్ట్రాల రాజధానులకి కలుపుతుంది. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నందున దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒకే పేరుతో రైళ్లు నడుస్తున్నాయి.
గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ : ఇది డీలక్స్ రైలు. దీనిలో సామాన్యులు కూడా ప్రయాణించవచ్చు.
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ : ఇవి దేశ రాజధాని ఢిల్లీని ప్రధాన రాష్ట్రాలతో అనుసంధానించే సాధారణ సూపర్‌ఫాస్ట్ రైళ్లు. బీహార్ సంపర్క్ క్రాంతి, రాజస్థాన్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఇలా పేర్లు ఉంటాయి.
మరిన్ని నాలెడ్జ్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి