HLL Lifecare Limited Jobs 2022: బీఎస్సీ నర్సింగ్ అర్హతతో..హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్!
భారత ప్రభుత్వరంగానికి చెందిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ (Staff Nurse Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
HLL Lifecare Limited Nursing Trainer Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ (Staff Nurse Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 59
పోస్టుల వివరాలు: నర్సింగ్ ట్రైనర్- 9, స్టాఫ్ నర్స్-50 పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.
అర్హతలు:
- నర్సింగ్ ట్రైనర్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టరయ్యి ఉండాలి. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- స్టాఫ్ నర్స్ పోస్టులకు జీఎన్‌ఎమ్/బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టరయ్యి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.24,500ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రిత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: